స్నేక్ గ్యాంగ్ కీచకులు దోషులే | Sakshi
Sakshi News home page

స్నేక్ గ్యాంగ్ కీచకులు దోషులే

Published Tue, May 10 2016 1:11 PM

స్నేక్ గ్యాంగ్ కీచకులు దోషులే - Sakshi

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ కేసులో ఎనిమిదిమందిని రంగారెడ్డి జిల్లా కోర్టు దోషులుగా తేల్చింది. నగర శివారులో అకృత్యాలకు పాల్పడిన స్నేక్‌గ్యాంగ్‌ కేసులో న్యాయస్థానం మంగళవారం తుది తీర్పును వెల్లడించింది. ఈ కేసులో A9గా ఉన్న సాలం హమ్‌దీ కేసును న్యాయస్థానం కొట్టివేసింది.  నిందితులకు బుధవారం శిక్షలు ఖరారు కానున్నాయి.

రెండేళ్ల క్రితం పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్లో వీరిపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. 2014 జులై 31న స్నేక్‌గ్యాంగ్‌ సభ్యులు ఫాంహౌజ్‌లో చొరబడి ఓ యువతిని పాముతో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసులో పోలీసులు నిందితులపై భారత శిక్షా స్మృతి 376డి, 341, 452, 323, 395, 506, 212, 411 రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ప్రధాన నిందితుడు ఫైసల్‌ దయాని(ఎర్రకుంట), ఖాదర్‌ బరాక్బ(ఉస్మాన్‌నగర్‌), తయ్యబ్‌ బసలమ(బండ్లగూడ,బార్కాస్‌), మహ్మద్‌ పర్వెజ్‌(షాయిన్‌నగర్‌), సయ్యద్‌ అన్వర్‌(షాయిన్‌నగర్‌), ఖాజా అహ్మద్‌ (ఉస్మాన్‌నగర్‌), మహ్మద్‌ ఇబ్రాహీం (షాయిన్‌నగర్‌), అలీ బరాక్బ (షాయిన్‌నగర్‌), సలాం హండీ (బిస్మిల్లాకాలనీ)లను నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం వీరిలో ఏడుగురు నిందితులు చర్లపల్లి కారాగారంలో విచారణ ఖైదీలుగా ఉండగా మిగతా ఇద్దరు బెయిల్‌పై బయటకు వచ్చారు.

Advertisement
Advertisement