‘నంద్యాలలో ఏపీ మంత్రులపై నిఘా పెంచండి’ | Shailaja Kiran appealed to the Election Commissioner Bhanwarlal | Sakshi
Sakshi News home page

‘నంద్యాలలో ఏపీ మంత్రులపై నిఘా పెంచండి’

Aug 15 2017 3:00 AM | Updated on Oct 19 2018 8:10 PM

నంద్యాల శాసనసభ ఉప ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని వైఎస్సార్‌సీపీ మహిళా ప్రధాన కార్యదర్శి శైలజా కిరణ్‌

సాక్షి, హైదరాబాద్‌: నంద్యాల శాసనసభ ఉప ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని వైఎస్సార్‌సీపీ మహిళా ప్రధాన కార్యదర్శి శైలజా కిరణ్‌ ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రజాభిమానాన్ని అడ్డదారిలో కొనుగోలు చేసేందుకు ఏపీ క్యాబినెట్‌ మొత్తం నంద్యాలలోనే ఉందని, వారి పర్యటనలు, పంపకాలపై పూర్తి స్థాయి నిఘా పెంచాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఎమ్మెల్యే రోజాపై చేసిన అనుచిత వ్యాఖ్యలు టీడీపీ నేతల మానసిక స్థితికి అద్దంపడుతున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్‌లో స్థిరపడ్డ నంద్యాల వాసులంతా పోలింగ్‌ రోజున వెళ్లి సీమ పౌరుషాన్ని చాటిచెప్పాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement