రెండోరోజు బైఠాయించిన చక్రి తల్లి, సోదరుడు | second day of the Chakri mother, brother | Sakshi
Sakshi News home page

రెండోరోజు బైఠాయించిన చక్రి తల్లి, సోదరుడు

Mar 3 2016 12:28 AM | Updated on Sep 3 2017 6:51 PM

రెండోరోజు బైఠాయించిన చక్రి తల్లి, సోదరుడు

రెండోరోజు బైఠాయించిన చక్రి తల్లి, సోదరుడు

దివంగత సినీ సంగీత దర్శకుడు చక్రికి చెందిన ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి మంగళవారం ధర్నాకు దిగిన చక్రి తల్లి ...

సోమాజిగూడ: దివంగత సినీ సంగీత దర్శకుడు చక్రికి చెందిన ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి మంగళవారం ధర్నాకు దిగిన చక్రి తల్లి విద్యావతి, సోదరుడు మహత్ రెండో రోజా బుధవారం కూడా తమ నిరసన కొనసాగించారు. సోమాజిగూడలోని వరుణ్ సర్గం అపార్ట్‌వెంట్ ముందు ఉన్న ఫుట్‌పాత్‌పై బైఠాయించారు. వారు మాట్లాడుతూ తమ నివాసంలో అక్రమంగా ఉంటున్న మాధవి ఇల్లు ఖాళీ చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని తేల్చిచెప్పారు.

ఈ క్రమంలో అపార్ట్‌మెంట్ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఇరువర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. మహత్ మాట్లాడుతూ తాము ఆరోపిస్తున్నట్లుగా తమ ఇంట్లో ఉంటున్న మాధవి అబద్దాలు చెబుతోందని, తమకు అద్దె చెల్లిస్తున్నట్లు ఆధారాలు చూపమంటే చూపకుండా వేధిస్తుందని ఆరోపించారు. అమెరికాలో ఉంటున్న చక్రి సతీమణి శ్రావణి వస్తేనే ఇల్లు ఖాళీ చేస్తాననని ఆమె మధ్యవర్తులతో చెప్పినట్లు తెలిసిందని, ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement