
విధుల్లో ఒత్తిడికి గురికావొద్దు
పాత్రికేయ రంగంలో వివిధ విభాగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు ఒత్తిడికి లోనుకాకుండా ఉత్సాహంగా విధులు నిర్వర్తించాలని ‘సాక్షి’ చైర్‌పర్సన్ వైఎస్ భారతీరెడ్డి సూచించారు.
మహిళా పాత్రికేయులకు సాక్షి చైర్‌పర్సన్ వైఎస్ భారతీరెడ్డి సూచన
సాక్షి, హైదరాబాద్: పాత్రికేయ రంగంలో వివిధ విభాగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు ఒత్తిడికి లోనుకాకుండా ఉత్సాహంగా విధులు నిర్వర్తించాలని ‘సాక్షి’ చైర్‌పర్సన్ వైఎస్ భారతీరెడ్డి సూచించారు. బుధవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ – 12లోని ‘సాక్షి’ జర్నలిజం స్కూల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భారతీరెడ్డి మాట్లాడు తూ... మహిళా ఉద్యోగులు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆరోగ్యం తర్వాతే మిగతా పనులన్నారు.
ఘనంగా సాక్షి మహిళా దినోత్సవ వేడుకలు
ఒక వైపు ఉద్యోగం... మరో వైపు కుటుంబ బాధ్యతలు నిర్వహించే మహిళలు కుటుంబానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలో డాక్టర్ సుజాత వివరించారు. పనిచేసే చోట మహిళ లు ఎలా ఉండాలనే అంశాలను డాక్టర్ ప్రణతీరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ‘సాక్షి’ కార్పొరేట్ కమ్యూనికేషన్ డైరెక్టర్ రాణిరెడ్డి, సీఎఫ్‌వో సి.మహేశ్వరి, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.