బోడుప్పల్లో భారీ చోరీ | robbers hulchul in boduppal | Sakshi
Sakshi News home page

బోడుప్పల్లో భారీ చోరీ

Sep 1 2016 11:19 AM | Updated on Aug 30 2018 5:27 PM

తూర్పు సైబరాబాద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్లో అర్థరాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు.

హైదరాబాద్ : తూర్పు సైబరాబాద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్లో అర్థరాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి... 25 తులాల బంగారు ఆభరణాలతోపాటు 25 తులాల వెండి ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. అలాగే ఎల్ఈడీ టీవీతోపాటు కొంత నగదును కూడా అపహరించుకుని పోయారు.

చోరీ విషయాన్ని గురువారం ఉదయం స్థానికులు గుర్తించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... చోరీ జరిగిన తీరును పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement