'వాళ్లకు భయపడే సెప్టెంబరు 17ను నిర్వహించటం లేదు' | ramachander rao statement on september 17th | Sakshi
Sakshi News home page

'వాళ్లకు భయపడే సెప్టెంబరు 17ను నిర్వహించటం లేదు'

Sep 12 2015 8:20 PM | Updated on Mar 29 2019 9:31 PM

తెలంగాణ ప్రభుత్వం ఎంఐఎం పార్టీకి భయపడే తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించటంలేదని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు విమర్శించారు.

రంగారెడ్డి(తాండూరు): తెలంగాణ ప్రభుత్వం ఎంఐఎం పార్టీకి భయపడే తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించటంలేదని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు విమర్శించారు. తాండూరులో విలేకరులతో మాట్లాడుతూ.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న కేసీఆర్‌పై సీబీఐ విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీయాలని ఆయన కోరారు. టీఆర్‌ఎస్ తన ఏడాది పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సీఎం సొంత జిల్లా మెదక్‌లోనే రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు పరామర్శించలేదని ఆయన విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement