6న నిరాహార దీక్షలు: ఆర్‌. కృష్ణయ్య

R krishnayya given call to the hunger strike on 6th - Sakshi

హైదరాబాద్‌: వచ్చే నెల 6న రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేపట్టనున్నామని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులను ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఈ దీక్షలు చేస్తున్నామన్నారు. శనివారం హైదరాబాద్‌ విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉత్తర తెలంగాణ జిల్లాల సంస్థాగత నిర్మాణ సమీక్ష జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్‌. కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అఖిలపక్షాలతో ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలసి పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టించాలని డిమాండ్‌ చేశారు.

సంఘ అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గుజ్జ కృష్ణ, శారద గౌడ్, నీల వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్‌. కృష్ణయ్య సంఘ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొండేటి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా జి. రాధాకృష్ణారావు, మంచిర్యాల జిల్లా చైర్మన్‌గా చిట్ల సత్యనారాయణ, అధ్యక్షుడిగా కర్రె లచ్చన్న, మంచిర్యాల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా భేరి సత్యనారాయణలను నియమించారు. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top