'చంద్రబాబు నిర్ణయానికి పూర్తిగా వ్యతిరేకం' | r krishnaiah fighting to BC people | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు నిర్ణయానికి పూర్తిగా వ్యతిరేకం'

Dec 1 2015 6:22 PM | Updated on Jul 28 2018 6:51 PM

'చంద్రబాబు నిర్ణయానికి పూర్తిగా వ్యతిరేకం' - Sakshi

'చంద్రబాబు నిర్ణయానికి పూర్తిగా వ్యతిరేకం'

కాపులను బీసీ సామాజిక వర్గంలో చేర్చడం అంశానికి తాను పూర్తిగా వ్యతిరేకమని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య స్పష్టంచేశారు.

హైదరాబాద్: కాపులను బీసీ సామాజిక వర్గంలో చేర్చడం అంశానికి తాను పూర్తిగా వ్యతిరేకమని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య స్పష్టంచేశారు. హైదరాబాద్లో మంగళవారం నాడు మీడియాతో ఆయన మాట్లాడారు. కాపులను వీరి సామాజిక వర్గంలో చేర్చడం వల్ల బీసీలు నష్టపోతారని పేర్కొన్నారు.

కాపులను బీసీల్లో చేర్చడం అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరాలోచించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చేందుకు కమిషన్ వేయడంపై బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు ఇటీవలే ఆయన ప్రకటించిన విషయం అందరికీ విదితమే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement