'ప్రగతి' హనుమంతరావు కన్నుమూత | pragati printers founder hanumantarao passes away | Sakshi
Sakshi News home page

'ప్రగతి' హనుమంతరావు కన్నుమూత

Mar 2 2015 7:44 PM | Updated on Sep 2 2017 10:11 PM

చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు, ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి హనుమంతరావు సోమవారం మరణించారు.

చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు, ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి హనుమంతరావు సోమవారం మరణించారు. కమ్యూనిస్ట్ ఉద్యమం, స్వాతంత్ర్య ఉద్యమాలలో పాల్గొన్న హనుమంతరావు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

కృష్ణాజిల్లా చిట్టూర్పులో 1921లో జన్మించిన పరుచూరి హనుమంతరావు బందరు హిందూ హైస్కూల్లో మెట్రిక్ వరకు చదివారు. మద్రాసు పచ్చయ్యప్ప కాలేజి నుంచి బి.ఏ. పూర్తిచేశారు. స్వాతంత్ర్య ఉద్యమాలలో పాల్గొని రాజమండ్రి, కడలూరు జైళ్ళలో శిక్ష అనుభవించారు. బొంబాయి పీపుల్స్‌ ధియేటర్‌లో బలరాజ్‌ సహానీ వంటి ప్రముఖులతో కలిసి నాటక ప్రదర్శనలిచ్చారు. 1962లో హైదరాబాద్‌లో ప్రగతి ప్రెస్‌ స్థాపించి మంచి ప్రమాణాలు పాటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement