‘కచ్చితంగా మా దగ్గరకు తిరిగొస్తుంది’ | poornima sai parents confident she return to home | Sakshi
Sakshi News home page

‘కచ్చితంగా మా దగ్గరకు తిరిగొస్తుంది’

Jul 19 2017 9:47 AM | Updated on Sep 7 2018 1:59 PM

‘కచ్చితంగా మా దగ్గరకు తిరిగొస్తుంది’ - Sakshi

‘కచ్చితంగా మా దగ్గరకు తిరిగొస్తుంది’

నగరంలో అదృశ్యమై ముంబైలో ఆచూకీ లభించిన కూకట్‌పల్లి విద్యార్థిని పూర్ణిమ సాయి బుధవారం ఉదయం హైదరాబాద్‌కు తిరిగి చేరింది.

హైదరాబాద్‌: నగరంలో అదృశ్యమై ముంబైలో ఆచూకీ లభించిన కూకట్‌పల్లి విద్యార్థిని పూర్ణిమ సాయి బుధవారం ఉదయం హైదరాబాద్‌కు తిరిగి చేరింది. ఆమెను పోలీసులు ముంబై నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. నింబోలిఅడ్డాలోని బాలికాసదన్‌కు ఆమెను తరలించారు. ఇవాళ మహిళా కమిషన్‌ ఎదుట హాజరుపరిచాక పూర్ణిమను తల్లిదండ్రులకు అప్పగించే విషయంపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లేందుకు ఆమె విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో పూర్ణిమకు మరోసారి కౌన్సెలింగ్‌ ఇవ్వనున్నారు. అయితే పూర్ణిమ తమ దగ్గరకు కచ్చితంగా వస్తుందన్న విశ్వాసాన్ని ఆమె తల్లిదండ్రులు వ్యక్తం చేశారు. తమ కుమార్తె ఇష్టప్రకారం నడుచుకుంటామని ‘సాక్షి’ టీవీతో చెప్పారు.

గత నెల 7వ తేదీన పూర్ణిమ సాయి ఆచూకీ లేకుండా పోయిన విషయం తెలిసిందే.  ముంబైలో డోం గ్రీ ప్రాంతంలోని బాలల గృహంలో ఆమె ఉన్నట్టుగా ఆదివారం గుర్తించారు. సోమవారం ఆమె తల్లిదండ్రులు నాగరాజు, విజయకుమారి, సైబరాబాద్‌ పోలీ సులు కలసి ముంబైకి వెళ్లారు. తన తల్లిదండ్రులను కలిసేందుకు, వారితో తిరిగి వచ్చేందుకు పూర్ణిమ నిరాకరించింది. దీంతో వారు అదే రోజున తిరిగి హైదరా బాద్‌కు వచ్చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement