పూర్ణిమ.. ఇక ఇంటికే | Poornima sai interesting to go home | Sakshi
Sakshi News home page

పూర్ణిమ.. ఇక ఇంటికే

Jul 20 2017 2:27 AM | Updated on Sep 7 2018 1:59 PM

విలేకరులతో మాట్లాడుతున్న డీసీపీ విశ్వప్రసాద్, కూకట్‌పల్లి ఏసీపీ భుజంగరావు - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న డీసీపీ విశ్వప్రసాద్, కూకట్‌పల్లి ఏసీపీ భుజంగరావు

‘తల్లిదండ్రులను కలవను, నేను వారితో ఉంటే వారికి చెడు జరుగుతుంది..’అంటూ భీష్మించుకు కూర్చున్న పూర్ణిమసాయి వైఖరిలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది.

కన్నవారి వద్దకు వెళ్లేందుకు ఆసక్తి
 
సాక్షి, హైదరాబాద్‌: ‘తల్లిదండ్రులను కలవను, నేను వారితో ఉంటే వారికి చెడు జరుగుతుంది..’అంటూ భీష్మించుకు కూర్చున్న పూర్ణిమసాయి వైఖరిలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. ఇంటికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. జూన్‌ 7న హైదరాబాద్‌ లో అదృశ్యమైన పూర్ణిమ ముంబైలో ఉన్నట్లు పోలీసులు కనుగొన్న విషయం తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున నగరానికి తీసుకువచ్చిన పూర్ణిమని బాలల పరిరక్షణ సమితి(సీడబ్ల్యూసీ) ఆదేశాల మేరకు కాచి గూడ నింబోలిఅడ్డాలోని ప్రభుత్వ బాలికల సదన్‌కు తరలించారు. విషయం తెలుసుకొని ఉదయం బాలసదన్‌కు వచ్చిన ఆమె తల్లిదం డ్రులు నాగరాజు, విజయకుమారి సాయంత్రం వరకు అక్కడే వేచి ఉన్నారు. ఆమె ఉద్దేశాన్ని కౌన్సెలర్లు కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు.

చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు వెంకటేశ్వర్లు, పి.అంజన్‌రావు కూడా పూర్ణిమను కలసి ఇల్లు వదలి వెళ్లేందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ‘నేను యాక్టింగ్‌ కోర్సు చేస్తానంటే ఇంట్లో వద్దన్నారు. నాన్న డాక్టర్‌ కావాలని గట్టిగా కోప్పడ్డాడు. అందుకే ఇంటి నుంచి వెళ్లా. అమ్మనాన్నల వద్దకు వెళ్లేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని ఆమె వారితో చెప్పినట్టు తెలిసింది.  సాయంత్రం తల్లిదండ్రులు, అమ్మమ్మతో మాట్లాడినట్టు సమాచారం. ముంబై నుంచి దాదాపు 14 గంటలపాటు ప్రయాణం చేసి అలసిపోయిన పూర్ణిమ కుదుటపడ్డాక మాట్లా డతామని, ఆమె ఇష్టాఇష్టాలు తెలుసుకుంటా మని, ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులతో మాట్లా డాక ఓ నిర్ణయానికి వస్తామని సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ పద్మావతి ‘సాక్షి’కి తెలిపారు.

ఇప్పటికే పూర్ణిమ మానసిక స్థితి కుదుటపడేలా కౌన్సెలింగ్‌ ఇస్తున్నామని, ఆమె తల్లిదండ్రు లతో వెళ్లేందుకు ఇష్టంగానే ఉన్నట్టు తెలిసిం దని, రేపు మరోసారి బాలికతో మాట్లాడిన తర్వాత శుక్రవారం సీడబ్ల్యూసీ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పద్మావతి, వెంకటే శ్వర్లు, విజయాదేవి, నాగేశ్వరరావు, బాలా రాజ్‌లతో కూడిన బెంచ్‌ ఆఫ్‌ మేజిస్ట్రేట్స్‌ సమావేశమై పూర్ణిమతో, తర్వాత తల్లిదండ్రు లతో మాట్లాడనుంది. ప్రముఖ మానసిక నిపుణుడు వీరేందర్‌ పూర్ణిమకు కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు వెళ్లినా అనుమతించలేదు. 
 
మానసిక ఒత్తిడికి లోనైంది: అంజన్‌రావు
పూర్ణిమ మానసికంగా ఒత్తిడికి గురైనట్లు కనిపి స్తోందని అంజన్‌రావు అన్నారు. బాలిక తల్లి దండ్రులతో ఉండేందుకు అయిష్టత వ్యక్తం చేస్తూనే, ఒక్కోసారి వెళతానని అంటోందన్నా రు. పూర్ణిమని మాదాపూర్‌ డీసీపీ విశ్వ ప్రసాద్, కూకట్‌పల్లి ఏసీపీ భుజంగరావు కలిశారు. బాలిక మనస్సులో ఏదో ఆందోళనకరమైన విషయం ఉన్నట్లు కనిపిస్తోందని వారు తెలి పారు. బాలిక ఆరోగ్యంగానే ఉందన్నారు. తల్లిదండ్రులకు పంపే విషయంలో సీడబ్ల్యూ సీదే తుది నిర్ణయమని చెప్పారు.
 
చదువులోనూ ముందంజే...
నిజాంపేటలోని భాష్యం స్కూల్‌లో చదివే పూర్ణిమ విద్యార్థులందరితో కలివిడిగా ఉండడం తోపాటు చదువు విషయంలోనూ ముందంజలో ఉంటుందని ప్రిన్సిపాల్‌ సుధీర్‌ తెలిపారు. 70 శాతం పైగా మార్కులు సాధించి తరగతి గదిలో ముందువరుసలో ఉంటుందని చెప్పారు. ఆమె స్నేహితులు సాయిశ్రీ, పూజిత, దుర్గ మాట్లాడుతూ పూర్ణిమ అప్పుడప్పుడూ ఒంటరిగా ఉండి ఏదో ఆలోచిస్తుండేదన్నారు. ఆమెను ఏదైనా బాధ ఉన్నదా? అని అడిగితే తనకు ఇంట్లో అవమానం జరుగుతోందని చెప్పేదని వివరించారు. తన సోద రిని ఒక విధంగా, తనను మరోవిధంగా తన తల్లి దండ్రులు చూడడం ఎంతో బాధ కలిగించిందని చెప్పేదన్నారు. తనకు బ్యాంక్‌ ఉద్యోగం చేయాలని కూడా ఉందని పూర్ణిమ కొన్ని సందర్భాల్లో చెప్పినట్లు స్నేహితులు వివరించారు. ఇంట్లో జరుగుతున్న చిన్న, చిన్న మనస్పర్ధలే ఆమె ఇంటి వదిలివేయడానికి కారణం అయి ఉండవచ్చని ఆమె స్నేహితులు అభిప్రాయపడ్డారు. 

Advertisement
 
Advertisement
Advertisement