అనుమతులు లేకుండా ఇంటర్నెట్ సెంటర్లను నిర్వహిస్తున్న యజమానులపై పోలీసులు ఆదివారం కేసులు నమోదు చేశారు.
ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటర్నెట్ సెంటర్లను నిర్వహిస్తున్న యజమానులపై రాజేంద్రనగర్ పోలీసులు ఆదివారం కేసులు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం... స్టేషన్ పరిధిలో కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటర్నెట్ సెంటర్లను ఏర్పాటు చేశారు. కానీ ఇంటర్నెట్ సెంటర్ ఏర్పాటుకు స్థానిక పోలీస్‌స్టేషన్, జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి తీసుకోవాలి. అలాగే సెంటర్‌కు వచ్చే వారి పేరు, ఐడీ కార్డును తప్పని సరిగా రికార్డులో పొందుపరచాలి. ఈ నిబంధనలను ఊల్లంగించి హైదర్ గూడ, అత్తాపూర్, శివరాంపల్లి ప్రాంతాలలో ఏడు ఇంటర్నెట్ సెంటర్లు వినియోగిస్తున్నారు. ఆదివారం ఉదయం రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ ఉమేందర్ ఆధ్వర్యంలో ఈ సెంటర్లపై దాడులు చేసి కేసులు నమోదు చేశారు.