ఈనెల 19న నిజాం కాలేజ్ గ్రౌండులో సీపీఎం సభకు ఇచ్చిన అనుమతిని పోలీసులు రద్దు చేశారు.
హైదరాబాద్: సీపీఎం చేపట్టిన మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 19న నిజాం కాలేజ్ గ్రౌండులో తలపెట్టిన సభకు ఇచ్చిన అనుమతిని పోలీసులు రద్దు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విచ్చేస్తున్నారు. అయితే ఆయన రాకను ఆర్‌ఎస్‌ఎస్, ఇతర అనుబంధ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాగా, పోలీసులు అనుమతి ఇవ్వకున్నా అదే రోజు మరోచోట సభ నిర్వహిస్తామని సీపీఎం వర్గాలు స్పష్టం చేశాయి.