కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ టికెట్ చార్జీలను తాత్కాలికంగా పెంచారు.
	సాక్షి, హైదరాబాద్: కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ టికెట్ చార్జీలను తాత్కాలికంగా పెంచారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రూ.10 నుంచి రూ.20కు పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ సోమవారం ఓ ప్రకటనలో  తెలిపారు.
	
	ఈ నెల 10 నుంచి 17 వరకు ఈ పెంపు అమల్లో ఉంటుందన్నారు. అనవసరమైన వ్యక్తులను నియంత్రించేందుకే ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను పెంచినట్లు తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
