'కేసీఆర్కి ప్రజల దీవెనలున్నాయి' | people blessing to kcr, says nayani narsimha reddy | Sakshi
Sakshi News home page

'కేసీఆర్కి ప్రజల దీవెనలున్నాయి'

Jan 26 2016 12:04 PM | Updated on Oct 20 2018 5:05 PM

'కేసీఆర్కి ప్రజల దీవెనలున్నాయి' - Sakshi

'కేసీఆర్కి ప్రజల దీవెనలున్నాయి'

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి ప్రజలు దీవెనలున్నాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు.

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి ప్రజలు దీవెనలున్నాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. అందుకు ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం అని తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో 67వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నాయిని పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాడు తెల్లదొరలను తరిమి స్వాతంత్రం సాధించుకున్నామని... నేడు అన్యాయాన్ని ఎదిరించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని నాయిని స్పష్టం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement