ఆకట్టుకుంటున్న ప్రొకబడ్డీ గణేశ్‌లు | people attract pro kabaddi ganesh status in west marredpally | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న ప్రొకబడ్డీ గణేశ్‌లు

Sep 6 2016 10:51 PM | Updated on Sep 4 2017 12:26 PM

ఆకట్టుకుంటున్న ప్రొకబడ్డీ గణేశ్‌లు

ఆకట్టుకుంటున్న ప్రొకబడ్డీ గణేశ్‌లు

నగరంలోని భక్తులను ప్రొ కబడ్డీ గణేశ్లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

హైదరాబాద్: నగరంలోని భక్తులను ప్రొ కబడ్డీ గణేశ్లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వెస్ట్ మారేడుపల్లి నెహ్రూనగర్ పార్కు వద్ద ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ గణేశ్ విగ్రహాలను చూసేందుకు భక్తులు అసక్తి చూపుతున్నారు. తెలుగు టైటన్స్, పాట్నా పైరేట్స్ టీమ్‌ల మద్య జరిగిన ఫైనల్ పోరును గణేశ్ రూపంలో విగ్రహాలను ఏర్పాటు చేశారు.

కబడ్డీ కోర్టులో రెండు వైపులా ఒకొక్క టీమ్ లో ఏడుగురు క్రీడాకారులను ఏర్పాటు చేశారు. మధ్యలో రిఫరీగా శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ వినాయక విగ్రహాలను దర్శించుకునేందుకు నగరవాసులు బారులు కడుతున్నారు. ప్రతి సంవత్సరం కొత్తదనంతో గణేశ్ విగ్రహాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఫ్రెండ్స్ యూత్ అసోషియేషన్ సభ్యులు నిఖిల్, వివేక్, ప్రశాంత్ వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement