దానం నాగేందర్ రాజీనామాకు ఆమోదం | PCC accepts Danam nagendar resignation | Sakshi
Sakshi News home page

దానం నాగేందర్ రాజీనామాకు ఆమోదం

Feb 8 2016 3:25 PM | Updated on Aug 21 2018 12:12 PM

గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ చేసిన రాజీనామాను పీసీసీ ఆమోదించింది.

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ చేసిన రాజీనామాను పీసీసీ ఆమోదించింది. హైకమాండ్ సూచన మేరకు దానం రాజీనామాకు పీసీసీ ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ దానం నాగేందర్ శనివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పంపించారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement