సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో తోపులాట | passengers rush in secunderabad railway station | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో తోపులాట

Jan 13 2017 4:22 PM | Updated on Apr 7 2019 3:28 PM

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో తోపులాట - Sakshi

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో తోపులాట

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల మధ్య తోపులాట జరిగింది.

- పోలీసుల లాఠీచార్జి
హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో నగరంలోని బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం  సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఫలక్‌నుమా రైలు ఎక్కేసమయంలో ప్రయాణికుల మధ్య తోపులాట జరిగింది. జనరల్‌ బోగీలో ఎక్కాల్సిన ప్రయాణికులను రైల్వే పోలీసులు క్యూలైన్లో ఉంచారు.

రైలు వచ్చే సమయంలో ప్రయాణికులు క్యూ నుంచి బయటకు వచ్చి రైలు ఎక్కేందుకు ప్రయత్నించడంతో.. గందరగోళ పరిస్థితి తలెత్తింది. వారిని అదుపు చేయడం కోసం పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పల్లవి అనే ప్రయాణికురాలికి తీవ్ర గాయాలు కావడంతో.. స్టేషన్‌లోనే ఆమెకు ప్రాధమిక చికిత్స అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement