ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నవీన్‌చంద్ | new Intelligence chief navincand | Sakshi
Sakshi News home page

ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నవీన్‌చంద్

Sep 2 2016 3:53 AM | Updated on Sep 4 2017 11:52 AM

ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నవీన్‌చంద్

ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నవీన్‌చంద్

అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.

►ఏడుగురు ఐపీఎస్‌లకు స్థానచలనం
►సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సందీప్ శాండిల్యా

సాక్షి, హైదరాబాద్: అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఏకంగా కీలకమైన స్థానాల్లో ఉన్న సీనియర్లను బదిలీ చేస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న బి.శివధర్‌రెడ్డిని బదిలీ చేసింది. ఆయన స్థానంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న నవీన్‌చంద్‌ను కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించింది. శివధర్‌రెడ్డికి  ఐజీ పర్సనల్ పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం అక్కడున్న సందీప్ శాండిల్యాను సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమించారు.

వరంగల్ రేంజీ డీఐజీ టి.ప్రభాకర్‌రావును డీఐజీ ఇంటెలిజెన్స్‌గా, ఆ పోస్టులో ఉన్న ఎన్.శివశంకర్‌రెడ్డిని సీఐడీ విభాగంలో డీఐజీగా నియమించారు. ప్రస్తుతం సీఐడీ డీఐజీగా ఉన్న రవివర్మకు వరంగల్ రేంజీ డీఐజీగా పోస్టింగ్ ఇచ్చారు. సీఐడీ ఎస్పీగా ఉన్న కె.రమేశ్‌నాయుడును రాచకొండ కమిషనరేట్‌లో ట్రాఫిక్ డీసీపీగా నియమించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement