నవవధువు ఆత్మ‘హత్య’? | New bride suicide? | Sakshi
Sakshi News home page

నవవధువు ఆత్మ‘హత్య’?

Apr 28 2015 11:42 PM | Updated on Nov 6 2018 7:56 PM

అనుమానాస్పద స్థితిలో నవవధువు మృతి చెందింది. ఆత్మహత్య చేసుకుందని భర్త అంటుండగా....

 భర్తే చంపాడని బంధువుల ఫిర్యాదు

.సరూర్‌నగర్: అనుమానాస్పద స్థితిలో నవవధువు మృతి చెందింది. ఆత్మహత్య చేసుకుందని భర్త అంటుండగా... అతడే ఉరేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తూ బంధువులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.  మీర్‌పేట ఎస్‌ఐ వెంకటయ్య కథనం ప్రకారం... లెనిన్‌నగర్‌లో నివాసం ఉంటూ బండల పని చేసుకుంటున్న వెంకటేష్‌కు షామీర్‌పేట మండలం లాల్‌గడీ మలక్‌పేటకు చెందిన మంగ (20)ను ఇచ్చి రెండు నెలల క్రితం పెళ్లి చేశారు. 

వెంకటేష్‌కు ఇది రెండో వివాహం.  కొద్ది రోజులుగా కట్నం విషయంలో దంపతుల మధ్య గొడవ జరుగుతోంది.  కాగా, మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో మంగ ఉరేసుకొని మృతి చెంది కనిపించింది.    భర్త వెంకటేష్ ఆమెకు ఉరేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.పోలీసులు మంగ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement