
నయీం ప్రధాన అనుచరుడు అరెస్ట్
మాజీ మావోయిస్టు నయీం ప్రధాన అనుచరుడు యూసఫ్ను టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
మాజీ మావోయిస్టు నయీం ప్రధాన అనుచరుడు యూసఫ్ను టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నగరం పాతబస్తీలో యూసఫ్ తలదాచుకున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దాంతో టాస్క్ఫోర్స్ పోలీసులు పాత బస్తీలో పలు నివాసాలపై దాడులు చేశారు. ఆ క్రమంలో యూసఫ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు స్టేషన్కు తరలించారు. నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ నేత కొనపురి. రాములు హత్య కేసులో యూసఫ్ ప్రధాన నిందితుడని పోలీసులు వెల్లడిచారు. యూసఫ్పై బాలానగర్ పోలీసు స్టేషన్లో ఇప్పటికే రౌడీషీట్ తెరచి ఉందని టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తు చేశారు.
గత నెల 12వ తేదీన నల్గొండ పట్టణంలో జరిగిన వివాహ వేడుకలకు మాజీ మావోయిస్టు, నల్గొండ జిల్లా టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు కొనపురి రాములు హాజరైయ్యారు. అదే సమయంలో అక్కడ మాటువేసిన కొంతమంది దుండగులు రాములు కళ్లలో కారం కొట్టి.... తుపాకులతో పలుమార్లు కాల్పులు జరిపారు. దాంతో రాములుని ఆసుపత్రికి తరలిస్తుండగా తుది శ్వాస విడిచారు.
అయితే రాములు సోదరుడు, మావోయిస్టు నేత సాంబశివుడు గతంలో హత్యకు గురైయ్యారు. మాజీ మావోయిస్టు నయీంకు సాంబశివుడు సోదరులకు చాలా కాలంగా వైరం ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా నయీం అనుచరుడు యూసఫ్ ను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.