
ఘనంగా నేవీ డే
నావికాదళ దినోత్సవాన్ని పురస్కరించుకొని నావికాదళ బ్రోచర్‌ను గవర్నర్ నరసింహన్ గురువారం రాత్రి బొల్లారంలోని నేవీ హౌస్‌లో ...
విశాఖపట్నం బీచ్‌లో గురువారం నిర్వహించిన ‘నేవీ డే’ ఉత్సవాల్లో భాగంగా భారత తూర్పు నౌకాదళం విన్యాసాలు అబ్బురపరచాయి.
బొల్లారంలో..
నావికాదళ దినోత్సవాన్ని పురస్కరించుకొని నావికాదళ బ్రోచర్‌ను గవర్నర్ నరసింహన్ గురువారం రాత్రి బొల్లారంలోని నేవీ హౌస్‌లో విడుదల చేశారు. నేవీ డీఎండీఈ రియల్ అడ్మిరల్ కాళీదాస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అంతకుముందు నేవీ సిబ్బంది బ్యాండ్‌తో అతిథులను ఆహ్వానించడం ఎంతగానో ఆకట్టుకుంది.
నౌకాదళంలో విజయాలను అందించిన యుద్ధనౌకల ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇందులో ఏఎన్‌ఎస్-మాగార్, ఐఎన్‌ఎస్, రంజిత్, రాణా, కుక్రే మహల్ తదితర యుద్ధనౌకల ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. కార్యక్రమంలో త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు, మాజీ అధికారులు, రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
- బొల్లారం