ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. తాను ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నానంటూ ఉమా చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు.
కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం చెరువుపల్లిలో తాను భూములు ఆక్రమిస్తున్నట్లు ఆరోపిస్తున్నారని, ఆ భూముల వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వం చట్ట ప్రకారం వ్యవహరిస్తే భూములు ఇవ్వడానికి తాము సిద్ధమని చెప్పారు. మంత్రి దేవినేని ఉమా అవినీతి గురించి గంటల కొద్దీ మాట్లాడొచ్చని.. ఒకవైపు ఆయన ప్రజల భూములు ఆక్రమిస్తూ తనపై ఆరోపణలు చేస్తారా అని నిలదీశారు.