
బెడ్ రూంలో స్పై కెమెరాలు
ఇంట్లో అద్దెకుంటున్న వారి పడక గదులలో స్పై కెమెరాలు బిగించిన వ్యక్తిని ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
నిందితుడి రిమాండ్
హైదరాబాద్ (చాంద్రాయణగుట్ట):
ఇంట్లో అద్దెకుంటున్న వారి పడక గదులలో స్పై కెమెరాలు బిగించిన వ్యక్తిని ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డీఐ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..గౌలిపురా నల్లపోచమ్మ బస్తీకి చెందిన విజయానంద్ కార్పెంటర్, ఎలక్ట్రిషియన్‌గా పని చేసేవాడు. ఇతను తన ఇంట్లోని మూడు పోర్షన్ల చెందిన బెడ్ రూంలలో మూడు నెలల క్రితం స్పై కెమెరాలు ఏర్పాటు చేసి తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న కంప్యూటర్ ద్వారా వీక్షించేవాడు.
దీనిపై కిరాయిదారురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని నుంచి కంప్యూటర్, మూడు స్పై కెమెరాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.