నగరంలో మజ్లిస్ అధినేత పాదయాత్ర | Majlis, the head of the city's March | Sakshi
Sakshi News home page

నగరంలో మజ్లిస్ అధినేత పాదయాత్ర

Apr 13 2016 12:15 AM | Updated on Oct 8 2018 8:39 PM

నగరంలో మజ్లిస్ అధినేత పాదయాత్ర - Sakshi

నగరంలో మజ్లిస్ అధినేత పాదయాత్ర

జాతీయ స్థాయి రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గంలోని సమస్యల

సిటీ బ్యూరో: జాతీయ స్థాయి రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాదయాత్రలు చేపట్టారు. ఒక వైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో  బరిలో దిగేందుకు అక్కడ విసృ్తతంగా పర్యటిస్తున్న ఆయన మంగళవారం హైదరాబాద్ పాతబస్తీలో పాదయాత్ర నిర్వహించారు.


బహద్దుర్ పురా, జవార్‌నగర్, నర్సారెడ్డి కాలనీ, తాడ్బాన్, రామానర్సాపుర తదితర ప్రాంతాల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల, ఐటీఐలను తనిఖీలు నిర్వహించారు. ఆయన వెంట జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు  గఫ్ఫార్, ముబీన్,సలీం తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement