వచ్చే నెలలో తెలంగాణకు ఫడ్నవీస్ | Maharashtra Chief Minister Devendra Fadnavis visits to telangana next month | Sakshi
Sakshi News home page

వచ్చే నెలలో తెలంగాణకు ఫడ్నవీస్

Jun 23 2016 7:41 PM | Updated on Oct 8 2018 5:57 PM

మహారాష్ట్ర ముఖ్యమత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చే నెలలో తెలంగాణ పర్యటనకు రానున్నారు.

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చే నెలలో తెలంగాణ పర్యటనకు రానున్నారు. తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు గురువారం ఫడ్నవీస్తో భేటీ అయ్యారు. ఆయన ఈ సందర్భంగా ఫడ్నవీస్ను తెలంగాణ రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు. హరీశ్ ఆహ్వానానికి ఫడ్నవీస్ అంగీకారం తెలిపారు.

దీంతో వచ్చే నెల రెండో వారంలో ఫడ్నవీస్ హైదరాబాద్ రానున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకున్న హరీశ్ రావు నేరుగా ముంబై వెళ్లారు.  అక్కడ నుంచి ఆయన హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్టులపై చర్చించనున్నట్లు సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement