మీరు తెలంగాణ పై దృష్టిపెట్టండి: మాదాసు గంగాధరం | Madasu gangadharam Comments on VH | Sakshi
Sakshi News home page

మీరు తెలంగాణ పై దృష్టిపెట్టండి: మాదాసు గంగాధరం

Jun 13 2016 3:00 PM | Updated on Mar 22 2019 5:33 PM

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను కాపు ఉద్యమంలోకి లాగవద్దని తెలంగాణ కాంగ్రెస్ నేత వీ హనుమంత రావుకు ఏపీ సీసీ ఉపాధ్యక్షులు మాదాసు గంగాధర్ విజ్ఞప్తి చేశారు.

- వీహెచ్ కు ఏపీసీసీ ఉపాధ్యక్షుడి సలహా
- పవన్ కళ్యాణ్ ను కాపు ఉద్యమంతో ముడిపెట్టదన్న గంగాధరం
హైదరాబాద్

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను కాపు ఉద్యమంలోకి లాగవద్దని తెలంగాణ కాంగ్రెస్ నేత వీ హనుమంత రావుకు ఏపీ సీసీ ఉపాధ్యక్షులు మాదాసు గంగాధర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఇందిరాభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపు ఉద్యమం కేవలం ముద్రగడ కుటుంబ సమస్య కాదని అన్నారు.


కాగా.. వీహనుమంత రావు సీనియర్ ఎంపీగా పనిచేశారని.. ఆయన తెలంగాణ శ్రేయస్సుపై దృష్టి పెడితే బాగుంటుందని అన్నారు. పిలవని పేరంటానికి వచ్చినట్లు ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చి.. పవన్ కళ్యాణ్ ను కాపు ఉద్యమానికి ముడిపెట్టి మాట్లాడటం సరికాదని అన్నారు. విభజన చట్టంలోని హామీలు నెరవేరలేదని, ఆంధ్ర ప్రదేశ్ ఇబ్బందుల్లో ఉందన్నారు. ముద్రగడ దీక్ష విరమించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement