సాగర్‌లో దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం | lovers suicide attempt at tankbund in hyderabad | Sakshi
Sakshi News home page

సాగర్‌లో దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

Dec 8 2015 9:25 PM | Updated on Sep 3 2017 1:42 PM

సాగర్‌లో దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

సాగర్‌లో దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

వారిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

రాంగోపాల్‌పేట్: వారిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కానీ, వారి పెళ్లికి పెద్దలు అడ్డుగా నిలిచారు. దీంతో కలిసి జీవించలేకున్నా.. కలిసే చనిపోవాలని వారు నిశ్చయించుకున్నారు. ట్యాంక్‌బండ్‌కు చేరుకుని హుస్సేన్ సాగర్‌లో దూకిన ఆ జంటను పోలీసులు రక్షించారు. వివరాలలోకి వెళితే... సికింద్రాబాద్ మోండా ప్రాంతానికి చెందిన నల్లా నాగేష్ కుమారుడు వినోద్‌కుమార్, మేకలమండికి చెందిన బానోతు నాగులు కుమార్తె కుమారి మోండాలోని ఓ కిరాణా స్టోర్‌లో గత రెండేళ్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరి మనసులు కలవడంతో ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడి అదే ప్రేమగా మారింది.

ఆరు నెలల క్రితం ఈ విషయం కుమారి ఇంట్లో తెలిసి ప్రేమజంటను మందలిస్తూ వస్తున్నారు. వారి పెళ్లికి అంగీకరించకుండా కుమారికి సొంత బావతో ఈ నెలలోనే పెళ్లి చేయాలని నిశ్చయించారు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన ప్రేమజంట చనిపోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం అర్థరాత్రి హుస్సేన్ సాగర్‌లో దూకారు. గస్తీలో ఉన్న లేక్ పోలీసులు వారిని బయటకు తీశారు. అనంతరం ఇన్‌స్పెక్టర్ శ్రీదేవి వారి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. కేసును గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement