'కేసీఆర్ మెదక్ జిల్లాకే సీఎంగా వ్యవహరిస్తున్నారు' | Komatireddy Venkat reddy takes on kcr | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ మెదక్ జిల్లాకే సీఎంగా వ్యవహరిస్తున్నారు'

Jan 12 2016 2:41 PM | Updated on Aug 15 2018 9:30 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లాకే సీఎంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లాకే సీఎంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు.  మంగళవారం హైదరాబాద్లోని ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం సచివాలయానికి వచ్చిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విలేకర్లతో మాట్లాడారు.

రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు వాగ్దానం చేసినా... నిధులు కూడా ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నల్గొండ జిల్లాకు మెడికల్ కాలేజీ కేటాయింపు ఏమైందని ప్రశ్నించారు. అలాగే ఎస్ఎల్బీసీ సొరంగం ఎందుకు ఆలస్యమైందని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వెంకటరెడ్డి నిలదీశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement