దేశ భద్రతకు భంగం కలిగేలా, రాష్ట్ర పోలీ సు వ్యవస్థను కించ పరిచేలా కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ చేసిన ప్రకటనపై తెలంగాణ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: దేశ భద్రతకు భంగం కలిగేలా, రాష్ట్ర పోలీసు వ్యవస్థను కించ పరిచేలా కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ చేసిన ప్రకటనపై తెలంగాణ ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీజే ఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ పోలీసులు బోగస్ ఐఎస్ ఐఎస్ సైట్‌ను సృష్టించి ముస్లిం యువ తను తీవ్రవాదం వైపు ప్రోత్సహి స్తున్నా రని ట్వీటర్ వేదికగా దిగ్విజయ్ చేసిన ఆరోపణలు అర్థరహితమని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మతి భ్రమించి ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారా లేక ఐఎస్‌ఐ, ఐఎస్‌ఐఎస్ వంటి సంస్థలకు మద్దతుగా మాట్లాడుతు న్నారా అని అనుమానం కలుగుతోందన్నా రు. అది దిగ్విజయ్ అభిప్రాయమో లేక కాంగ్రెస్ పార్టీ విధానమో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కు ఉగ్రవాదాన్ని అరికట్టే విషయంలో స్పష్టత లేదన్నారు.