కేసీఆర్ ఎర్రవల్లికే ముఖ్యమంత్రా?: జూలకంటి | julakanti fired on cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ ఎర్రవల్లికే ముఖ్యమంత్రా?: జూలకంటి

Jun 12 2016 2:44 AM | Updated on Aug 15 2018 9:30 PM

కేసీఆర్ ఎర్రవల్లికే ముఖ్యమంత్రా?: జూలకంటి - Sakshi

కేసీఆర్ ఎర్రవల్లికే ముఖ్యమంత్రా?: జూలకంటి

కేసీఆర్ తన దత్తత గ్రామానికే ముఖ్యమంత్రా.. మొత్తం రాష్ట్రానికి కాదా అని సీపీఎం నాయకుడు జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు.

సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ తన దత్తత గ్రామానికే ముఖ్యమంత్రా..
మొత్తం రాష్ట్రానికి కాదా అని సీపీఎం నాయకుడు జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు.ఎర్రవల్లిలోని వారికి రుణాలు అందించడం, ట్రాక్టర్లు పంపిణీ చేయడం, ఇతరత్రా సహాయం అందించడం అభినందనీయమేనన్నారు. అయితే ఎర్రవల్లిలోని ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామని చెబుతున్న సీఎం, ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగమిస్తామన్న ప్రకటనలు మరిచిపోయారా అని ప్రశ్నించారు. తన దత్తత గ్రామానికే పరిమితం కాకుండాయావత్ రాష్ట్రాన్ని  సొంత ఊరిగా చూసుకోవాల్సిన అవసరం లేదా అని ఆయన ఒక ప్రకటనలో నిలదీశారు. శనివారం నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టును పార్టీ నాయకులతో కలసి సందర్శించినపుడు అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement