బోర్డు తిప్పేసిన జాబ్‌ కన్సల్టెన్సీ | job consultancy fraud in hyderabad | Sakshi
Sakshi News home page

బోర్డు తిప్పేసిన జాబ్‌ కన్సల్టెన్సీ

Aug 23 2017 11:50 AM | Updated on Sep 4 2018 5:29 PM

నిరుద్యోగులను నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన ఓ కన్సల్టెన్సీ బోర్డు తిప్పేసింది.

- ఉద్యోగాల పేరుతో లక్షల్లో వసూలు
 
హైదరాబాద్‌: ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన ఓ కన్సల్టెన్సీ నిర్వాహకుడు బోర్డు తిప్పేశాడు.  విదేశాల్లో ఉద్యోగాలు అంటూ సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డలో కొందరు సూర్య కన‍్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు.
 
కెనడాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అభ్యర్థుల కన్సల్టెన్సీ నిర్వాహకులు ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష చొప్పున వసూలు చేశారు. ఇలా సుమారు వందమంది నుంచి డబ్బులు తీసుకుని రాత్రికి రాత్రే బోర్డు తిప్పేశారు. విషయం తెలిసి బాధితులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement