
హైదరాబాదీలకు ఐఎస్ఐఎస్ డబ్బు ఎర!
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి హైదరబాద్ నగరంలో కలకలం సృష్టించారు. పది మంది యువకులకు ఉగ్రవాదులు భారీ మొత్తంలో పారితోషికం ఎరగా వేశారు.
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి హైదరబాద్ నగరంలో కలకలం సృష్టించారు. పది మంది యువకులకు ఉగ్రవాదులు భారీ మొత్తంలో పారితోషికం ఎరగా వేశారు. వారిని దుబాయ్ మీదుగా సిరియాకు తరలించేందుకు వ్యూహం పన్నారు.
అయితే.. ముందుగానే వారి కుట్రను పసిగట్టిన ఇంటెలిజెన్స్ వర్గాలు.. ఐఎస్ఐఎస్లో చేరేందుకు సిద్ధమైన నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నాయి. యువకులను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, తల్లిదండ్రులకు అప్పగించారు.