నగర యువతికి యూపీ గవర్నర్ అవార్డు అందజేత | hyderabad girl gains king george medical university award received from UP governor | Sakshi
Sakshi News home page

నగర యువతికి యూపీ గవర్నర్ అవార్డు అందజేత

Dec 14 2016 8:09 PM | Updated on Sep 7 2018 1:59 PM

నగరానికి చెందిన యువతి కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ నాలెడ్జ్ అవార్డ్ దక్కించుకుంది.

హైదరాబాద్: నగరానికి చెందిన యువతికి నాలెడ్జ్ అవార్డు దక్కింది. అల్వాల్ భూదేవినగర్ ప్రాంతానికి చెందిన విశ్రాంత ఆర్మీ అధికారి సయ్యద్ ఇబ్రహీం కుమార్తె సయ్యద్ బేబానస్రీకి కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ నాలెడ్జ్ అవార్డ్ దక్కించుకుంది.

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం కెఎల్‌ఆర్ ఆనోరా దంత వైద్య కళాశాలలో బీడీఎస్ ఫైనలియర్ చదువుతున్న బేబానస్రీ కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో జరిగిన సైన్టిఫిక్ కన్వెన్షన్‌లో కట్టుడు పళ్ల విభాగంలో ప్రతిభ కనబర్చింది. దీంతో కింగ్ జార్జ్ యూనివర్సిటీ ఆమెకు ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్‌నాయక్ చేతుల మీదుగా అవార్డు అందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement