'బాజీరావ్ మస్తానీ' విడుదలను అడ్డుకోండి | Hindu group seeks ban on 'Bajirao Mastani' for 'distorting' history | Sakshi
Sakshi News home page

'బాజీరావ్ మస్తానీ' విడుదలను అడ్డుకోండి

Dec 13 2015 8:27 PM | Updated on Sep 4 2018 5:07 PM

'బాజీరావ్ మస్తానీ' విడుదలను అడ్డుకోండి - Sakshi

'బాజీరావ్ మస్తానీ' విడుదలను అడ్డుకోండి

'బాజీరావ్ మస్తానీ' సినిమా విడుదల కాకుండా చూడాలని హిందూ జాగృతి సమితి(హెచ్ జేఎస్) డిమాండ్ చేసింది.

హైదరాబాద్: 'బాజీరావ్ మస్తానీ' సినిమా విడుదల కాకుండా చూడాలని హిందూ జాగృతి సమితి(హెచ్ జేఎస్) డిమాండ్ చేసింది. చరిత్రను వక్రీకరించి ఈ సినిమా రూపొందించారని ఆరోపించింది. ఈ మేరకు కేంద్ర సెన్సార్ బోర్డు, కేంద్ర సాంస్కృతిక శాఖకు ఆదివారం ఫిర్యాదు చేసింది. 'బాజీరావ్ మస్తానీ' భార్యలు డాన్స్ చేసినట్టు 'పింగా పింగా' పాటలో చూపించారని, ఇది అబద్ధమని హెచ్ జేఎస్ తెలిపింది.

ఆ కాలంలో గౌరప్రదమైన పీష్వా కుటుంబాలకు చెందిన స్త్రీలు సినిమాలో చూపించినట్టుగా డాన్సులు చేయలేదని హెచ్ జేఎస్ తెలంగాణ సమన్వయకర్త చంద్ర మొగర్ ఒక ప్రకటనలో తెలిపారు. చరిత్రను వక్రీకరించడం తగదని పేర్కొన్నారు. పీష్వా కుటుంబ వ్యవస్థను అగౌరపరిచేలా ఉన్న పింగా, పింగా పాటను తొలగించాలని డిమాండ్ చేశారు. 'బాజీరావ్ మస్తానీ' సినిమా ఈ నెల 18న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement