ఇరిగేషన్‌ అధికారులపై హైకోర్టు ఆగ్రహం | high court slams irrigation officers | Sakshi
Sakshi News home page

ఇరిగేషన్‌ అధికారులపై హైకోర్టు ఆగ్రహం

Jan 28 2017 2:33 AM | Updated on Sep 4 2018 5:07 PM

భద్రాచలం పేపర్‌ బోర్డు నీటి వినియోగంలో తెలంగాణ ఇరిగేషన్‌ అధికారులపై ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

సాక్షి, హైదరాబాద్‌: భద్రాచలం పేపర్‌ బోర్డు నీటి వినియోగంలో తెలంగాణ ఇరిగేషన్‌ అధికారులపై ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గోదావరి నుంచి రోజుకు ఎంత నీటిని వాడుకుంటున్నారో లెక్కించి చెప్పాలన్న ఆదేశాలను పాటించకపోవడంపై మండిపడింది. ఒక దశలో కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసేందుకుసిద్ధమైంది. అయితే, ప్రభుత్వ న్యాయవాది అదనపు అఫిడవిట్‌ దాఖలు నిమిత్తం 2 వారాల గడువు కోరడంతో కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయ మూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వు లు జారీ చేసింది.  భద్రాచలం పేపర్‌ బోర్డు అక్రమంగా నీటిని వాడు కుంటోందని ఇరిగేషన్‌ అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ శ్రీనివాస్‌ అనే వ్యక్తి 2012లో హైకోర్టులో ఈ పిల్‌ దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement