గ్రూప్స్ నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాలి | Groups notification should be issued immediately | Sakshi
Sakshi News home page

గ్రూప్స్ నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాలి

Apr 9 2016 2:41 AM | Updated on Aug 10 2018 8:16 PM

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1,2,3,4 సర్వీసులకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.

టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య డిమాండ్

 హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1,2,3,4 సర్వీసులకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని కలసి వినతిపత్రం సమర్పించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావొస్తున్నాగ్రూప్స్ నోటిఫికేషన్ జారీ చేయలేదని తెలిపారు. విభజన జరిగి ఏపీలో  వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అయితే నిరుద్యోగులు మాత్రం లక్షల సంఖ్యలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement