రాజ్భవన్లో గవర్నర్ ఇఫ్తార్ విందు | Governor Narsimhan hosts Iftar Party at Raj Bhavan, kcr attend | Sakshi
Sakshi News home page

రాజ్భవన్లో గవర్నర్ ఇఫ్తార్ విందు

Jun 24 2016 7:23 PM | Updated on Aug 21 2018 11:41 AM

రంజాన్ మాసం పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శుక్రవారం రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందు ఇచ్చారు.

హైదరాబాద్ : రంజాన్ మాసం పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శుక్రవారం రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసన మండలి చైర్మన్లు చక్రపాణి, స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డితో పాటు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీలు జితేందర్ రెడ్డి, డీ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీ నేతలు, రాష్ట్ర హజ్ కమిటీ అధికారి, మత పెద్దలు ఈ విందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుండాలని ...తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా బతకాలని గవర్నర్ ఆకాంక్షించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గుంటూరులో ఇఫ్తార్ విందు ఇచ్చింది. ఈ ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement