ముగిసిన గోదావరి రివర్ బోర్డ్ మీటింగ్ | godavari river board meeting held in jala soudha | Sakshi
Sakshi News home page

ముగిసిన గోదావరి రివర్ బోర్డ్ మీటింగ్

Jan 21 2016 5:39 PM | Updated on Sep 3 2017 4:03 PM

గోదావరి రివర్ బోర్డ్ సమావేశం గురువారం జలసౌధలో జరిగింది.

హైదరాబాద్: గోదావరి రివర్ బోర్డ్ సమావేశం గురువారం జలసౌధలో జరిగింది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుపై తెలంగాణ ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్లు ఇవ్వాలని తెలంగాణ అధికారులు కోరారు. అయితే పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగమని ఏపీ ఇరిగేషన్ అధికారులు తెలిపారు.

అలాగే తెలంగాణలో గోదావరి నదిపై చేపడుతున్న కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లను ఇవ్వాలని ఏపీ అధికారులు కోరగా అందుకు డీపీఆర్లు ఇంకా తయారు కాలేదని తెలంగాణ అధికారులు సమాధానం ఇచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement