బస్తీ మే వదిన, మరిది | GHMC Elections Special Stories... | Sakshi
Sakshi News home page

బస్తీ మే వదిన, మరిది

Jan 19 2016 1:36 AM | Updated on Nov 6 2018 4:13 PM

బస్తీ మే వదిన, మరిది - Sakshi

బస్తీ మే వదిన, మరిది

గ్రేటర్ ఎన్నికల్లో సిత్రాలెన్నో. బంధువుల మధ్యే బలమైన పోటీ. బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ బరిలో వదిన, మరిది నిలిచి ‘బస్తీ మే సవాల్’ అంటున్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో సిత్రాలెన్నో. బంధువుల మధ్యే బలమైన పోటీ. బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్  బరిలో వదిన, మరిది నిలిచి ‘బస్తీ మే సవాల్’ అంటున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ ఎల్‌బీనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం. రాంమోహన్‌గౌడ్ సతీమణి లక్ష్మీప్రసన్న రంగంలో ఉండగా... కాంగ్రెస్ నుంచి రాంమోహన్‌గౌడ్ పెదనాన్న ఎం. బాబయ్యగౌడ్ కుమారుడు సుమన్‌గౌడ్ పోటీ చేస్తున్నారు. అభ్యర్థులు వరుసకు వదిన, మరిది అవుతారు. దీంతో ఇక్కడ ఎన్నిక ఆసక్తికరంగా ఉండనుంది. వీరిద్దరి పోటీ డివిజన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ మొదటిసారిగా ఎన్నికల బరిలో ఉండడం గమనార్హం.
 - ఎల్‌బీనగర్

Advertisement
 
Advertisement
Advertisement