ఓట్లను తొలగిస్తున్నామనేది అవాస్తవం | EC Bhanwarlal condemns on voters removed from Hyderabad list | Sakshi
Sakshi News home page

ఓట్లను తొలగిస్తున్నామనేది అవాస్తవం

Sep 22 2015 5:01 PM | Updated on Sep 3 2017 9:47 AM

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటర్లను తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ అన్నారు.

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటర్లను తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ అన్నారు.  ఎవరికైనా సందేహాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని ఆయన మంగళవారమిక్కడ సూచించారు. ఒకవేళ ఓట్లు తొలగించినట్లు ఎవరి వద్ద అయినా ఆధారాలు ఉంటే చూపించాలని భన్వర్ లాల్ కోరారు.

ఇప్పటివరకు 5,14,796 మంది తమ ఓట్లను బదిలీ చేయించుకున్నారని,  89,085 మంది డూప్లికేటు ఓటర్లు ఉన్నారని తెలిపారు. డూప్లికేట్ ఓటర్లను మాత్రమే హైదరాబాద్ ఓటర్ల నుంచి తొలగించామని, అర్హులైన వారికి ఓటు హక్కు కల్పిస్తామని, అక్రమంగా ఒక్క ఓటు కూడా తొలగించలేదని భన్వర్ లాల్ స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement