టీవీ చూసేందుకు వచ్చిన బాలికపై లైంగికదాడి | Drunk man Sexually assaulted toddler in malakpet | Sakshi
Sakshi News home page

టీవీ చూసేందుకు వచ్చిన బాలికపై లైంగికదాడి

Feb 16 2017 6:06 PM | Updated on Jul 18 2019 2:26 PM

టీవీ చూసేందుకు వచ్చిన బాలికపై లైంగికదాడి - Sakshi

టీవీ చూసేందుకు వచ్చిన బాలికపై లైంగికదాడి

మద్యం మత్తులో ఓ కామంధుడు బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు.

హైదరాబాద్‌:
మద్యం మత్తులో ఓ కామంధుడు బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఎస్సై రంజిత్‌కుమార్‌ తెలిపిన వివరాలివీ.. అక్బర్‌బాగ్‌ డివిజన్‌ ప్రొఫెసర్స్‌కాలనీలోని ఓ ఇంట్లో కింది పోర్షన్‌లో కర్ణాటకలోని యాద్గిర్‌ జిల్లాకు చెందిన దంపతులు అద్దెకు ఉంటున్నారు. వారి కుమార్తె(9) రెండో తరగతి చదువుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజవరం మండలం కోటనందూరు గ్రామానికి చెందిన కాకేటి దేవుడు అలియాస్‌ రాజు (40) కుటుంబంతో కలిసి అదే ఇంట్లో రెండో అంతస్తులో ఉంటున్నాడు.

బుధవారం రాత్రి బాధితురాలు టీవీ చూడటానికి రాజు ఇంటిలోకి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మద్యం మత్తులో ఉన్న రాజు బాలికపై లైంగిక దాడి చేశాడు. బాధితురాలు రాత్రి 11 గంటలకు తల్లికి ఈ విషయం తెలిపింది. ఈ మేరకు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు గురువారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement