రాష్ట్రంలో సీమాంధ్రులకు కాకుండా తెలంగాణ అధికారులకు అవకాశం కల్పిం చాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సీమాంధ్రులకు కాకుండా తెలంగాణ అధికారులకు అవకాశం కల్పిం చాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు టి.వెంకటేశ్వర్లు, ఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు వేణుగోపాల రావు శుక్రవారం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీని వాసయాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రాకు వినతి పత్రాలు సమర్పించారు.
తెలంగాణ ఏర్పడి 20 నెలలు దాటినా ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో పనిచేస్తున్న వారికి పదోన్నతులు కల్పించడం లేదన్నారు. హైదరాబాద్‌లో సంయుక్త కమిషనర్ హోదాలో ఉన్న ఓ సీమాంధ్ర అధికారి ప్రభుత్వ ఓఎస్‌డీగా పదోన్నతి కోసం పైరవీలు చేసుకుంటుండగా, ఆయనకు అనుకూలంగా వ్యవహారాలు సాగుతున్నాయన్నారు. ప్రాముఖ్యత గల పోస్టులను సీమాంధ్ర అధికారులకు కేటాయించి అప్రధానమైన స్థానాల్లో తెలంగాణ వారిని నియమిస్తున్నారని పేర్కొన్నారు.