ఉచిత చేప పిల్లల పంపిణీ భేష్‌ | Distributed of free fish children is good | Sakshi
Sakshi News home page

ఉచిత చేప పిల్లల పంపిణీ భేష్‌

Apr 18 2018 3:01 AM | Updated on Apr 18 2018 3:01 AM

Distributed of free fish children is good - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం అమోఘమని కేరళ మత్స్యశాఖ మంత్రి మెర్సికుట్టి అమ్మ ప్రశంసించారు. మంగళవారం ఆమె సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్బంగా మెర్సికుట్టి అమ్మ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో మత్స్యరంగ అభివృద్ధికోసం అమలు చేస్తున్న పథకాలు ఎంతో బాగున్నాయని, కేరళలో కూడా వీటి అమలును పరిశీలిస్తామన్నారు. తలసాని ఆమెకు తెలంగాణ ప్రభుత్వం మత్స్యరంగ అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. అనంతరం కేరళ మంత్రి మెర్సికుట్టి అమ్మకు తలసాని మెమెంటో అందజేసి సత్కరించారు.  

Advertisement
 
Advertisement
Advertisement