డీజీపీ దిశానిర్దేశం

DGP directions  - Sakshi

కానిస్టేబుల్‌ నుంచి ఎస్పీ వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్ష

20 రోజుల్లోనే అన్ని జిల్లాల సమీక్షలు  

సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌ శాఖలో చేపట్టబో తున్న కార్యక్రమాలు, అమలు చేయాల్సిన పథకాలు మొత్తం కింది స్థాయిలోనే జర గాల్సి ఉంటుంది కాబట్టి ఆ శాఖలో కీల కంగా ఉన్న కానిస్టేబుల్‌ నుంచి ఎస్పీ స్థాయి అధికారులందరితో డీజీపీ మహేందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తొమ్మిది కమిషన రేట్లు, 18 జిల్లా పోలీస్‌ యూనిట్లలోని వేల మంది సిబ్బంది, అధికారులతో ములాఖత్‌ అయ్యారు. ప్రతీ స్టేషన్‌ పరిధిలో నమోదవు తున్న నేరాలు, వాటి నియంత్రణ చర్యలు,    టెక్నాలజీ వినియోగం..  ప్రతీ అంశాన్ని   సమీక్షించారు. 20 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌ శాఖలోని అన్ని విభాగా లపై మహేందర్‌రెడ్డి సమీక్ష పూర్తిచేశారు.

వాళ్లే వెన్నెముక..
పోలీస్‌ శాఖ ఏ కార్యక్రమం చేపట్టినా అధికారులతోనే సమీక్షలు జరిగేవి. వెన్నెముకగా ఉన్న సిబ్బందికి ఎలాంటి సమాచారం లేకుండా, కార్య క్రమం ఏంటన్నది కూడా సరిగ్గా తెలియని పరిస్థితులుండేవి.  కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలే కీలకం కావడంతో భవిష్యత్‌లో చేపట్టబో తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలపై డీజీపీ వారికి దిశానిర్దేశం చేశారు. టెక్నాలజీ పరం గా తీసుకురాబోతున్న మిషన్‌ 2018పై పూర్తి స్థాయిలో సిబ్బందికి వివరించారు.

హైదరా బాద్‌లో నేర నియంత్రణకు చేపట్టిన చర్యలు, అందులో సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమె రాల ఏర్పాటు,  లోక్‌అదాలత్, న్యాయ నిపుణుల సలహాలు.. ఇలా అనేక అంశాలపై   వివరించారు. సిబ్బందికి రావాల్సిన ప్రోత్సా హకాలు, పదోన్నతులపై క్లారిటీ ఇచ్చారు. ప్రతినెలా పోలీస్‌స్టేషన్‌వారీగా ఉత్తమ సిబ్బంది ఎంపిక,  ప్రోత్సాహకం అందించ డంపై నమ్మకాన్ని కల్గించారు. డీజీపీ ప్రతి   సబ్‌ ఇన్‌స్పెక్టర్‌తో మాట్లాడటంతో వారిలో ఆనందం వ్యక్తమైంది. సూచనలు నేరుగా ఇవ్వడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top