నయీమ్‌తో పోలీసుల విందుపై స్పందించాలి | CPI leader Narayana letter to State home minister, DGP | Sakshi
Sakshi News home page

నయీమ్‌తో పోలీసుల విందుపై స్పందించాలి

Feb 6 2017 3:40 AM | Updated on Aug 13 2018 6:24 PM

గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌తో సన్నిహితంగా మెలిగిన పోలీసుల వివరాలు బహిర్గతం చేయాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్‌ చేశారు.

రాష్ట్ర హోం మంత్రి, డీజీపీలకు సీపీఐ నేత నారాయణ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌తో సన్నిహితంగా మెలిగిన పోలీసుల వివరాలు బహిర్గతం చేయాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్‌ చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మకు ఆదివారం ఆయన లేఖ రాశారు. నయీమ్‌ ఉదంతాలపై సీబీఐ విచారణ చేయించాలని తాను కోర్టులో పిల్‌ వేస్తే...ప్రభుత్వం మాత్రం సిట్‌తో సరిపో తుందని చెప్పిందని గుర్తుచేశారు.

నయీమ్‌తో పోలీసు ఉన్నతాధికారులు విందు భోజనాలు చేస్తున్న ఫొటోలు బహిర్గతమైన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించాలని అన్నారు.  ఇప్పటికైనా నయీమ్‌ కేసును సీబీఐతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement