హైకోర్టు విభజనలో తమ పాత్ర లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ చేసిన వ్యాఖ్యలను...
సీపీఐ నేత చాడ
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజనలో తమ పాత్ర లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ చేసిన వ్యాఖ్యలను సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తప్పుబట్టారు. గతేడాది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా జరిపిన ప్రచారంలో త్వరలో హైకోర్టు విభజన జరుగుతుందని చెప్పిన విషయాన్ని సదానంద మరచిపోయారా అని ప్రశ్నిం చారు.
పార్లమెంట్ సాక్షిగా హైకోర్టు విభజనపై 50 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పిన మాటలు ఏమాయ్యాయన్నారు. ఇది ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమని ఒక ప్రకటనలో అన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రెండో రోజు మరో 9 మంది న్యాయాధికారులను సస్పెండ్ చేయడం పుండు మీద కారం చల్లినట్లుగా ఉందని చాడ వ్యాఖ్యానించారు.