నేడు నేరస్తుల సమగ్ర సర్వే

A comprehensive survey of criminals today - Sakshi

త్వరలో 18 వేల కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ

డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా గురు వారం నేరస్తుల సమగ్ర సర్వే నిర్వహించ నున్నట్లు డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి బుధవారం తెలిసారు. పదేళ్ల కాలంలో పోలీసు రికార్డుల్లో ఉన్న నేరగాళ్ళ ఇళ్లకు అధికారులు వెళ్లి వారి వివరాలను నమో దుచేస్తారని తెలిపారు. అలాగే వారి ఇళ్లనూ జియో ట్యాగింగ్‌ చేసి టీఎస్‌ కాప్‌ యాప్‌లో పొందుపరచ నున్నామన్నారు. కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకు అన్ని స్థాయిల అధికారులు ఈ సర్వేలో పాల్గొనను న్నారు. త్వరలో 18 వేల కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

జాబితా ఆధారంగా.. 
2008–2017 మధ్య ఒకటి కంటే ఎక్కువసార్లు అరెస్టు అయిన నిందితులు చెప్పిన చిరునామాలతో రూపొందించిన జాబితాల ఆధారంగా సర్వే జరగ నుంది. నేరస్తుడు ప్రస్తుతం ఏం చేస్తున్నాడు, కదలి కలు ఏంటి వంటి తదితర వివరాలు సేక రించడంతో పాటు అవసరమైతే సమీపం లో ఉండే బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్ళి ఆరా తీస్తారు. తాజా చిరునామా లతో వారు నివసిస్తున్న ప్రాంతాల వారీ గా జాబితాలు రూపొందిస్తారు. 

పూర్తయ్యే వరకూ సర్వే 
నేరస్తుడి ఇళ్లను జియో ట్యాగింగ్‌ చేసి టీఎస్‌ కాప్‌ యాప్‌లో పొందుపరుస్తారు. గస్తీ నిర్వహించే రక్షక్, బ్లూకోల్ట్‌ సిబ్బందికి ఇచ్చే ట్యాబ్స్‌లో ఈ యాప్‌ ఉంటుంది. ఈ ట్యాబ్‌ ఆధారంగానే నేరగాళ్ళ ఇళ్ళకు ఆయా సిబ్బంది వెళ్ళాల్సి ఉంటుంది. గురువారం సర్వే పూర్తి కాని నేపథ్యంలో పూర్తయ్యేవరకూ కొనసాగుతుందని, ప్రతి నేరస్తుడి ఆచూకీ కనిపెట్టి, వివరాలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ సర్వే నేపథ్యంలో స్థాని కులు తమకు సహకరించాలని కోరారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top