మహానగరంలో మాయలేడీ | Cheating woman in Hyderabad | Sakshi
Sakshi News home page

మహానగరంలో మాయలేడీ

Feb 20 2015 2:57 AM | Updated on Sep 2 2017 9:35 PM

ఆధ్యత డిజైనర్ క్రియేషన్ సంస్థ ముందు బాధితులు

ఆధ్యత డిజైనర్ క్రియేషన్ సంస్థ ముందు బాధితులు

మహానగరంలో ఓ మాయలేడీ మహిళలకు మాయమాటలు చెప్పి దాదాపు రెండు కోట్ల రూపాయలు కొల్లగొట్టింది.

హైదరాబాద్:  మహానగరంలో ఓ మాయలేడీ మహిళలకు మాయమాటలు చెప్పి దాదాపు రెండు కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. బాధితులు ఆమెను చితకబాది పఠాన్చెరు మండలం ఆర్సి పోలీసులకు అప్పగించారు. కర్ణాటకకు చెందిన ఈ మహిళ పటాన్ చెరు మండలం బీరంగూడలో ఆధ్యత డిజైనర్ క్రియేషన్ పేరుతో ఓ సంస్థను స్థాపించింది.  ప్రజాకర్షణ పథకాలతో మహిళలకు వల వేసింది.  వందలాది మహిళల నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేసింది.

రాత్రికి రాత్రి బోర్డు తిప్పేయడంతో బాధితులు ఆందోళనకు దిగారు. కార్యాలయంపై దాడి చేశారు. ఆమెను కొట్టి, పోలీసులకు అప్పగించారు. కార్యాలయంలోని సామాగ్రి మొత్తాన్ని బాధితులు తీసుకువెళ్లారు. ఆర్సి పురం పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement