లా ప్రవేశాలకు 29 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ | Certificate verification from 29 for Law entries | Sakshi
Sakshi News home page

లా ప్రవేశాలకు 29 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్

Oct 22 2016 1:24 AM | Updated on Sep 4 2017 5:54 PM

న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 29 నుంచి వచ్చే నెల 2 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను

31 నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్లు.. వచ్చే నెల 5న సీట్ల కేటాయింపు..
సాక్షి, హైదరాబాద్: న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 29 నుంచి వచ్చే నెల 2 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ప్రవేశాల కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను శుక్రవారం జారీ చేసినట్లు వెల్లడించారు. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో లాసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీలను నిర్ణయించినట్లు వివరించారు. మూడేళ్లు, ఐదేళ్ల న్యాయ విద్య, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు. విద్యార్థులు ఈనెల 31 నుంచి వచ్చే నెల 4 వర కు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని... వచ్చే నెల 5న  సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు.

 వచ్చే నెల 8 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు. రెండోదశ కౌన్సెలింగ్‌లో భాగంగా వచ్చే నెల 14, 15 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. కౌన్సెలింగ్ ప్రాసెసింగ్ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 250, ఇతర విద్యార్థులు రూ. 500 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యేందుకు హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ, ఏవీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, కూకట్‌పల్లి జేఎన్‌టీయూహెచ్, వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
 
 కోర్సు                      కాలేజీలు           సీట్లు            అర్హులైన అభ్యర్థులు
 మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ           22               3,320                9,897
 ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ               15                1740                  2811
 ఎల్‌ఎల్‌ఎం                      12                  560                  1620
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement